Monday, June 18, 2012

శూన్యం ఒకటే.....

ఒకటి  
ఎప్పటికీ ఒకటే 


రెండుకూ
ఒకటికన్నా బిగువే 


తొమ్మిది వరకూ 
ఇదే తంతు 
ఎవరేం తక్కువ ?


ఏదైనా చెప్పు 
కూడికలు తీసివేతలు 
భిన్నాలు శాతాలు 
బిగుసుకున్నవలలు 


ఆ తర్వాత 
అంతా లయం 
శూన్యం లోనికి ప్రవాహం 


*    *     *


ఉన్నదే ఉంటుంది 
ఇంకోరకంగా 
కన్ను తిప్పుతావ్ 
మెరిసే మెదడుతో 


నేను ఒకటంటాను 
నీవు తొమ్మిది లోంచి 
ఎనిమిది పోతుందంటావు


ఇంకో మిత్రుడు 
ఆరు నుండి ఐదు 
తీస్తానంటాడు 


ఒకటి 
ఎప్పటికీ ఒకటే 


*    *    *


ఒకటికి 
ఒకటి కలిపితే 
తర్వాతి వాడు 


ఒకటికి 
ఎనిమిది ఒకట్లు 
కలిపితే 
తొమ్మిదో వాడు 


ఎన్నైనా చెప్పు
కలయికలు 
విడదీసే భాగాహారాలు 
లోలోపలి చేతి వాటం చర్యలు 


శూన్యంతో
అందరికీ 
పరిమళమే...


*    *   *


నీవు 
ప్రకృతి 
నేను 
పురుషుడు 


నేను
ఒకటి 
నీవు 
శూన్యం 


    .....



4 comments:

  1. lekkallo bhavukatvaanni pandinchaaru chaalaa baagaa....baavundi

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ అండి....మీరు చెప్పింది కరెక్టే ...లెక్కల్లో కూడా తత్త్వం ఉంది కదా అని ఇలా.....

      Delete
  2. నేను
    ఒకటి
    నీవు
    శూన్యం
    అంటే 10 కదా:)

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ ప్రేరణ....

      Delete