Wednesday, June 6, 2012

ఆశ లేని హాయి

పదాల దాహం పెదాల భోగం 
డబ్బుల మత్తు భూముల మైకం


ఒక్కో రుచి మెదడు
ఆశ వెంట పడ్డాక చావనివ్వదు


ప్రకృతి సౌందర్యపు చిగురుటాకుల 
కదలికలు నా కిష్టం 
నా ముందు నోట్ల రాశి పోసినా 
పూల గాలికి కొట్టుకొని పోతా 


ఎగిరిపోతున్న బంగారానికి 
పారాచూట్లు కట్టుకొని ఎగబడే వారుంటారు 
ఇంట్లో పూజ గదిలో దేవుడికి 
స్థితి విన్నవించుకుంటారు కుటుంబసభ్యులు 


కొన్ని కోట్ల కథలు మనముందు 
ప్రవేశపెట్టిన పేదరాశిపెద్దమ్మ ఆశ 
దోపిడీ రూపం మార్చింది 
దొంగతనం వేషం మార్చింది 
పరిపాలన రంగులు మార్చింది 
కొన్ని పదాల అర్ధమే 
భాష సాక్షిగా గడపదాటింది 


యుగాలనుండి నడిచొచ్చిన  మోహనాంగి 
పట్టుకురారా స్వామీ 
నోరు మెదపనివ్వకు
బిర్యానీ తినిపిస్తాననకు 
నాలుగు బుక్కలు ఏదుంటే అది కలిపి పెట్టు 


వాకిట్లో చాపేసుకొని
వెన్నెల ముఖం చూడు 
కాలు మీద కాలేసుకుని 
నాన్న చెప్పిన పద్యం చెప్పు 
తెల్లారి నీ పక్కనుంటే ఒట్టు 


             ..... 



No comments:

Post a Comment