Sunday, June 3, 2012

ప్రయాణ వైరాగ్యం


  
కాలం వెనకాల కలలతో 
వెక్కి నడచుట సాధ్యమా?
మనసు చూపు నీ మీద నిలిపితే 
గుభాలించును దారి కదా!

ఈ ప్రయాణమంతా గడబిడలతో
కాళ్ళవల్లన  కాదు సుమా..
ప్రేమరధ చక్రాల మీదన  మనసు వుండెను 
ఇక ప్రపంచమంతా సులువు కదా...!
 
రాతిగునపం తలపై కూర్చున్నది
ఎప్పడు రాలునో గాలికి తెలుసన్నది
ఒకసారి నీ వలపు వదనం చూపితే 
అది పూల రుతువై మారు కదా...!

జ్ఞానమెంతగ రుచికరం నీకో 
అజ్ఞానమూ నాకంతేకదా..
తారతమ్యాలన్ని కూడా 
నీ ప్రేమ తదుపరి సున్నా కదా...


No comments:

Post a Comment