Monday, September 3, 2012

శ్రీ నౌదురి మూర్తి



మనసును కలవర పెట్టిన వాక్యాన్ని
వెంటనే కౌగిలించుకుంటాడు



కవి ఎవరనేది కాదతనికి ముఖ్యం
కవిత్వపు చిక్కదనమే
చక్కని సూచిక


అతని గుండెని తాకిన పద్యానికి
రెక్కలొస్తాయి
ఆంగ్లపు సూటు వేసుకొని దర్జాగా
కవి ముందు నిల్చొని గుర్తుపట్టమంటుంది


నౌదురి కంట్లో నలుసైనా పర్లేదు
మూర్తి ముఖంలో చిరునవ్వైతే ఇంకేముంది


మనందరికీ దూరంగా ఉన్నా
ఏదో ఓ రాత్రి సమయాన
ఓ కంట కనిపెట్టు కుంటూ
కనుగీటుకుంటూ పోయే
తర్జుమా తాత.

.....

No comments:

Post a Comment