Monday, March 23, 2009

దు:ఖోదయం

చలి వెన్నెల జోరు జలపాతం

ఒకే పుస్తకం లోంచి

ఇరువురి సమస్యల్ని చదువుకుంటాం

మనమీద హాస్యం విసురుకునే

అనాది బాధలు

రాలిపోతాం

వానాకాలపు తాకిడికి పూలవలె

మనసు మూగగా

ఒంటరి స్తంభమై నిలుస్తుంది

దాని చుట్టూతా

బడి పిల్లలు ఆడుకుంటారు

అదే పనిగా అమ్మ

అన్నమై పిలుస్తుంది

పాటలై

శోకాలు నాట్యం చేస్తాయి రాత్రికి రాత్రి

ఖాళీ నవ్వులు

ఖాళీ ఖాళీ ఆప్యాయతలు

ఊపిరి పెనవేసుకు పోయిన

మనుషుల జాడ తెలియదు

కిటికీ లోంచి

గాలితో పాటు గాయాలు కూడా

తెలవారుతాయి

రేడియో మీద వాలిన పిచ్చుక

పాటని నింపి పోతుంది

ముల్లుని ఏ స్టేషన్ మీదికి కదిపినా

అదే కమిలిన దుఃఖ౦.

...................

6 comments:

  1. Dear uncle..it is in which language?? I know English, Hindi, Marathi languages only.

    ReplyDelete
  2. poems chadivanu. bavunnai.

    ReplyDelete
  3. ముల్లుని ఏ స్టేషన్ మీదికి కదిపినా

    అదే కమిలిన దుఃఖ౦.

    ReplyDelete
  4. జీవన సత్యాలు నగ్నంగా మన ముందు నర్తిస్తోన్న దృశ్యం .....మెటఫర్స్ వేయడం లో మీరు చాలా గొప్ప ....ప్రేమతో....జగతి

    ReplyDelete