Tuesday, May 22, 2012

దానిమ్మ గింజల జల్లు.....2

1


కొన్ని రాత్రుళ్ళు
రహస్యాలు కుచ్చుకున్నాక 
నిద్ర కారిపోయింది


2


నీకోసం ఓ కలువ తెస్తే 
ప్రేమోత్కర్శలో మునిగిన 
గుండె గా తీసుకో





మాట కటువైనా
మనసు వెన్నెలముద్ద
కదా కలువా....!


       .....

1 comment:

  1. రహస్యాలు గుచ్చుకున్న ప్రతీ రేయి హారం మీ కలంలో పురుడు పోసుకుని ఇలా ఉదయిస్తున్న భావం....నైస్ సర్

    ReplyDelete