Wednesday, June 2, 2010

భాధా గుత్తులు

వస్తూ వస్తూ
నా లోపలి కిటికీలు తీస్తావు
కొన్నివేల
సీతాకోకచిలుకలు
విచ్చుకుంటాయి
రెప రెప రెప రెప రెప
రంగుల గిరికీలు కొడుతూ
వాసనల బరువు మోసుకోద్దామని
తీపి రాగాలై ,నీ
కనురెప్పల మీద వాలి
ఆనందపు జ్ఞానాన్ని పంచుకుంటాయి

వెళుతూ వెళుతూ
చివరి చూపుల కొనలగుండా
కాటుక చీకటి విదిల్చి
ఊపిరి గొట్టానికి
జడ పిన్ను బిగించి పోతావ్...

............

4 comments:

  1. Anonymous03 June, 2010

    నిజమే.

    ReplyDelete
  2. seetakoka chiluka palukulu bagunnai

    ReplyDelete
  3. మీ కవితలు దాదాపుగా చదివేసాను. వ్యక్తీకరణలు బాగున్నాయి. ఈ కవితా చిరుజల్లులా మొదలై ఉప్పెనలా కదిపింది. నా బ్లాగులో వ్యాఖ్య ద్వారాగానే తెలుసుకున్నా, ఆలస్యం కానందుకు ఆనందం.

    ReplyDelete