నా దగ్గర ఏమీ లేదు
కొన్ని అక్షరాలు
వాటిని అలంకరించిన
పూసలు చుట్టిన పూలు
జాగ్రత్తగా మాటలు వాడేవారు
వెనకా ముందూ ఆవేదనలో పడి
అదును కోసం ఆరాట పడతారు
తక్కువగా మాట్లాడేవారు
వడ్డీని మాత్రమే వాడి
జీవితానికి వాసన పొగల్నిచూపి
అసలంతా దాచి దాచి
మూగవారై,కనిపించిన పేపర్లతో
ముఖం మూసేస్తారు
బంగారు కొండా అని కొందరు
గుండెల మీదికి లాక్కొని
జీవితకాలపు ముచ్చట్లు
రంగుల పూల రాశిలా ముందర పోసి
నువ్వు ఊపిరి తీసుకునే లోపు
పరవశపు పందిరి కింద తట్టుకోలేవు
ఆయుధాలు ముందర పెట్టుకొని
అంబుల పొది లోంచి ఓ మాటను తీసి
దాన్ని చెక్కి ,బండకు రాసి
పలుకురాళ్ళతో పదును చేసి
నోటి తడి అద్ది
కోశ్శగా వుందా లేదా ...ఓసారి చర్మానికో
చెంపకో అద్ది చూసుకొని
వదులుతారు .....
మనం గిల గిల కొట్టుకుంటే
ఎంత ఆనందమో వారికి
నా దగ్గర ఏమీ లేదు
కొన్ని అక్షరాలు
వాటిని అలంకరించిన పూసలు చుట్టిన పూలు
పూలు విసిరినా బాధ కలిగితే
ఈ భూమి మీదికి వచ్చిన
ప్రత్యేక ఆహ్వానితులుగా పరిగణించాలి
వారిని నమస్కరించాలి
.....
కొన్ని అక్షరాలు
వాటిని అలంకరించిన
పూసలు చుట్టిన పూలు
జాగ్రత్తగా మాటలు వాడేవారు
వెనకా ముందూ ఆవేదనలో పడి
అదును కోసం ఆరాట పడతారు
తక్కువగా మాట్లాడేవారు
వడ్డీని మాత్రమే వాడి
జీవితానికి వాసన పొగల్నిచూపి
అసలంతా దాచి దాచి
మూగవారై,కనిపించిన పేపర్లతో
ముఖం మూసేస్తారు
బంగారు కొండా అని కొందరు
గుండెల మీదికి లాక్కొని
జీవితకాలపు ముచ్చట్లు
రంగుల పూల రాశిలా ముందర పోసి
నువ్వు ఊపిరి తీసుకునే లోపు
పరవశపు పందిరి కింద తట్టుకోలేవు
ఆయుధాలు ముందర పెట్టుకొని
అంబుల పొది లోంచి ఓ మాటను తీసి
దాన్ని చెక్కి ,బండకు రాసి
పలుకురాళ్ళతో పదును చేసి
నోటి తడి అద్ది
కోశ్శగా వుందా లేదా ...ఓసారి చర్మానికో
చెంపకో అద్ది చూసుకొని
వదులుతారు .....
మనం గిల గిల కొట్టుకుంటే
ఎంత ఆనందమో వారికి
నా దగ్గర ఏమీ లేదు
కొన్ని అక్షరాలు
వాటిని అలంకరించిన పూసలు చుట్టిన పూలు
పూలు విసిరినా బాధ కలిగితే
ఈ భూమి మీదికి వచ్చిన
ప్రత్యేక ఆహ్వానితులుగా పరిగణించాలి
వారిని నమస్కరించాలి
.....
bhagundandi mee kavitha chakkaga.
ReplyDelete