చాలా ఏళ్లుగా ఇంట్లో ఫ్యాన్
మా కోరికల మీదుగా
తిరుగుతూనే ఉంది
మా బాధల మీదుగా కూడా
మా పిల్లల చల్లగా ఆడిస్తూనే ఉంది
మా చెమటల్ని జోకొట్టింది
హఠాత్తుగా
మోకాళ్ళుఅరిగినట్టున్నాయో ,
లేదా,బుర్ర తిరిగినట్టుందో
విమానం లా గొంతెత్తింది
ఏది ఏమైనా
నిన్నటి రాత్రి
కళ్ళు మూసుకున్ననన్ను
ఆకాశమంతా తిప్పుకొచ్చింది
.....
ఈ తిరుగుడు రెక్కల్ని తిప్పాలేగానీ
ReplyDeleteఅందర్నీ ఏడేడు పధ్నాలుగు లోకాలనీ
తిప్పేస్తాయి
మన దిమ్మదిరిగేలా
_ జొన్నవిత్తుల