ఎందుకో ఓ సందర్భం
ముచ్చట పడుతుంది
గాలిని మచ్చిక చేసుకొని
మన మధ్య చెండులా మారటం కోసం
ఓ రహస్యం కనుగుడ్లు చిట్లి
మోదుగు పువ్వులా అగ్గి వెదజల్లి
మన ఉపరితలం ఫై
మనసు సహా స్ఫోటకపు వాత కాల్చివేస్తుంది
ఓ తలా తోకా లేని కౌగిలింత
చిన్నప్పటి తాటి మట్టల బండిలా
గుంజుకుపోయి
గుండెను డీ కొట్టి చిత్తడి చేస్తుంది
ఓ రాత్రి
మన యుద్ధాన్ని చూడలేక
ఉడతలా ఉరికురికి
పడకగది పుస్తకాల్లో నిర్వీర్యమౌతుంది
నీ చేతులకి నా గుండె కణాలు
ఏ సమాధానమూ చెప్పలేవు
ఓ చెలమ తోడి సిద్ధంగా ఉంటుంది
నన్ను చూసుకొమ్మని
.....
ముచ్చట పడుతుంది
గాలిని మచ్చిక చేసుకొని
మన మధ్య చెండులా మారటం కోసం
ఓ రహస్యం కనుగుడ్లు చిట్లి
మోదుగు పువ్వులా అగ్గి వెదజల్లి
మన ఉపరితలం ఫై
మనసు సహా స్ఫోటకపు వాత కాల్చివేస్తుంది
ఓ తలా తోకా లేని కౌగిలింత
చిన్నప్పటి తాటి మట్టల బండిలా
గుంజుకుపోయి
గుండెను డీ కొట్టి చిత్తడి చేస్తుంది
ఓ రాత్రి
మన యుద్ధాన్ని చూడలేక
ఉడతలా ఉరికురికి
పడకగది పుస్తకాల్లో నిర్వీర్యమౌతుంది
నీ చేతులకి నా గుండె కణాలు
ఏ సమాధానమూ చెప్పలేవు
ఓ చెలమ తోడి సిద్ధంగా ఉంటుంది
నన్ను చూసుకొమ్మని
.....
వావ్! చాలా బాగుంది!
ReplyDeleteథాంక్యూ అండి.....మీ బ్లాగ్ కూడా ఆశ్చర్యాలు పూసింది ..రసజ్ఞులు కదా...!
Delete