ఎదురుగ నువు లేని రోజు
ఎడబాటు కంప తగిలి
జల్లెడ తూట్లాయే మనసు
ఎందుకనో....!
రాతిరి తొలిచిన వేళలందు
చీకటి చెప్పిన కథలన్నీ
నీ చుట్టూ అల్లుకొనే
ఎందుకనో....!
జల జల పారుతున్న నీ
సెలయేరు మేని తగిలి
రాతి గుండె పాట పాడె
ఎందుకనో....!
కాలుకు ముళ్ళు దిగితె
కారిన నా రక్తం లో
నీ కన్నీరే దాగివుంది
ఎందుకనో....!
వణుకుతున్న చేతుల వ్యధ
కషాయ పాత్రకెరుక
కిందపడి ముక్కలాయె
ఎందుకనో....!
.....
ఎడబాటు కంప తగిలి
జల్లెడ తూట్లాయే మనసు
ఎందుకనో....!
రాతిరి తొలిచిన వేళలందు
చీకటి చెప్పిన కథలన్నీ
నీ చుట్టూ అల్లుకొనే
ఎందుకనో....!
జల జల పారుతున్న నీ
సెలయేరు మేని తగిలి
రాతి గుండె పాట పాడె
ఎందుకనో....!
కాలుకు ముళ్ళు దిగితె
కారిన నా రక్తం లో
నీ కన్నీరే దాగివుంది
ఎందుకనో....!
వణుకుతున్న చేతుల వ్యధ
కషాయ పాత్రకెరుక
కిందపడి ముక్కలాయె
ఎందుకనో....!
.....
No comments:
Post a Comment