తెలియకుండానే అన్నీ జరిగి పోతుంటే గుండె ముళ్ళ మీద వాలి మూలుగుతున్నట్టు...
గది కళ్ళు తెరవగానే ,రాత్రి ఎప్పుడు వచ్చి వెళ్ళిందో వర్షపు
వాసన...దిగులు దిగులుగా కుదిపి నిలబెట్టింది గోడవారన.
గది కళ్ళు తెరవగానే ,రాత్రి ఎప్పుడు వచ్చి వెళ్ళిందో వర్షపు
వాసన...దిగులు దిగులుగా కుదిపి నిలబెట్టింది గోడవారన.
ఆరి పోతున్న చినుకులు వంటి మీదికి సూర్య కిరణాలు పోసుకొని మెరిసిపోతూ నా వైపు చూసి నవ్వినను రమ్మన్నాయి.
అద్దం ముందు జరిగిన సంభాషణలో ...మేఘాల చాటు నుండి మెరిసిన తెల్లటి తంత్రి నా వయసును తాకి దిగులు వేగాన్ని రెండింతలు చేసి వేపచెట్టు గాలిని వేడి చేసింది .
తెలియకుండానే అన్నీ జరిగిపోతుంటే ...నా కంటి చివర్ల చేరిన సముద్రం గడ్డకట్టి గుసగుసలు పెట్టి మొత్తానికి ఒడ్డున చేర్చాయి .ప్రేమించేవాడే మొలకెత్తగలడని గడ్డిపూల పాటలు పసిపిల్లలై గోళీకాయల చప్పుళ్ళతో ఆడి ఆడి చెట్టుకింద సోమ్మసిల్లాయి .
ఆందోళనా గాలులు అనేకం కొట్టుకువచ్చి పొంచి వున్న వీధి చివర్ల వెంట నను వెళ్ళకుండా గొంతులో తివాచీ పరుచుకొని నను ఊయలలూపిన కవిత్వ మాంత్రికులు కనిపించడం మానినారు.
గడ్డిపూల గాలులు తగిలి కోలుకొని మనుషుల మధ్య ఆనవాలు పట్టుకొని కాలం వెంట పగుళ్ళ కాళ్ళతో పరుగెడుతూ ఒక రహస్యం చెప్పడానికి చేతుల్నిపూలగుత్తి చేసి ఇస్తున్నా...
తెలియకుండానే అన్నీ జరిగిపోతుంటే ...పూడుకుపోయిన గొంతులో తవ్విన కొద్దీ ప్రేమే .
తెలియకుండానే కొన్ని మంచి పనులు కూడా జరుగుతూ ఉంటాయ్ స్వామి గారు .....మీ కవిత్వం లో భావుకత వెనుక జీవన మర్మం బాగా ఆకట్టుకుంటుంది హృదయమున్న వారెవరైనా స్పందించక ఉండలేరు ....ప్రేమతో ....జగతి
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete"తెలియకుండానే అన్నీ జరిగిపోతుంటే ...
ReplyDeleteపూడుకుపోయిన గొంతులో తవ్విన కొద్దీ ప్రేమే"
నిజం ...ఆ ప్రేమే అక్షరమై క్షరం కాని భావుకత మీలో నింపిందేమో....మీ కలం వ్రాసినకొద్దీ ఊరుతున్న భావుకత...ఎక్కడున్నా మమ్మల్ని పట్టి లాక్కొస్తున్న ఫీల్....