Saturday, May 19, 2012

కొత్తగా పూస్తున్న గాలి

నేను నీకు
ఏదో చెప్పాలనుకున్నాను 


నా విచ్చుకుంటున్న భావాన్ని 
అందమైన పూలగుత్తిలా 
అలంకరించి ఇద్దామమనుకున్నాను 


కొత్తగా ఉండాలని 
అసలు వినగానే....
గుండె వెన్నెల ముద్దగునట్లు  
తయారుచేయదలిచాను 


మాటలు మల్లెల వంటివి 
మూట గట్టుకున్నాను 
రాత్రంతా చందనంలో తడిపి 
అత్తరు చల్లిపెట్టాను 


నిజం నీకు
ఏదో చెప్పదలిచాను ...


సంపెంగతో కాసేపు 
చింత చిగుళ్ళతో కాసేపు 
నీ గురించి మాట్లాడి 
నీ మనసురుచి సేకరించి 
వెన్నెల రాల్చిన ఆకాశపు చిత్రాల్ని 
కొత్తవి కొత్తవి కూడబెట్టుకున్నాను 


ధ్యాస ధ్యానమై 
ప్రతి నిమిషంలో 
నిను బంధించుకుంటూ 
శ్వాసను పవిత్రం చేసుకుంటూ 
ఆత్మను అలంకరించుకుంటున్నాను 


నిజం నీకు 
ఏదో చెప్ప దలిచి 
నన్ను నేను 
మార్చి మార్చిరాసుకుంటున్నాను 




         .....

3 comments:

  1. ధ్యాస ధ్యానమై
    ప్రతి నిమిషంలో
    నిను బంధించుకుంటూ
    శ్వాసను పవిత్రం చేసుకుంటూ
    ఆత్మను అలంకరించుకుంటున్నాను
    manasuni thakina gaali aathmiyapu sparshanisthundi

    ReplyDelete
  2. సంపెంగ సిరా చేసి కాలపు కలంలో పోసి
    చింత చిగురు అక్షరాలతో నీ వలపు తలపు
    నీకు మార్చి మార్చి చెప్పాలనుకున్నాను...

    కొత్తగా ఉంది సర్ మీ కవిత్వం...పాత మూస ధోరణికి తిలోదకాలిచ్చి....కొత్త రాగాలాలపిస్తున్న కోయిల సవ్వడి....

    ReplyDelete