Thursday, May 17, 2012

నేను లోపల వెలితి

సాయంకాలపు వేసవి గాలి 
పాడటానికి వచ్చింది... 
వెలితిగా ఉన్న నను చూసి 
చెట్టు మీది వీణను వేడుకుంది 


మనసు ఘనీభవించే సమయాన 
రాత్రి భయపడింది...
వెలితిగా ఉన్న నను చూసి 
వెన్నెలను బతిమిలాడింది 


కలతలు కలబోసుకుంటున్న సమయాన 
దుఃఖం భయపడింది ...
వెలితిగా ఉన్న నను చూసి 
మధువును వెంట బెట్టుకొచ్చింది


                 .....  



2 comments:

  1. మధువును వెంట బెట్టుకొచ్చింది eppatiki madhuvu velithini theerchaledu

    ReplyDelete
  2. మధువును చేరనీకండి మధురాలు కోల్పోతారు...
    కలతల చూసి వెక్కిరించండి...కలకలమని నవ్వేస్తారు...

    ReplyDelete