Wednesday, June 11, 2014
అలంకరణ
అలంకరణ
మనం అనుకున్నదే శాస్త్రం
మనం చెప్పినట్టు వినే వాళ్లే మన వారు
మన కోసం పని చేసే వారు మన సేవకులు
మనం ఎవరినీ ఇష్టపడం
మనల ఇష్ట పడే వారు తప్పుకొని పోలేరు
మన కోసమే ఎదుటి వారి శ్రమ వాడాలి
మనం సరదాని పొందగలం
వారి సంపద తో సంతోషం కూడబెట్టగలం
వారితో వున్నట్టుగా వుండటమే వారి అదృష్టం
మనం స్వార్ధం గా కనపడవద్దు
అవసరానికి ప్రార్ధించి పని ముగించాలి
లోపలి వాన్ని ఎల్లప్పుడు తడుపుతూ వుండాలి
ఎదుటి వాన్ని వాడటమే నేర్పు
మన ఖజానాకు రాకూడదు ముప్పు
మనం భజన చేసినా మనకే రావాలి మెప్పు
జనంలో నటించడం మరవద్దు
మన ఇంట్లో ఏముందో తెలియొద్దు
అవసరానికి తప్ప చిరునవ్వును కూడా తీయొద్దు
బంధాలకు గంధాలు పుయ్యాలి
భావాలను భలే గ ముయ్యాలి
తెలియనిదంతా మన జ్ఞానం తో దాయాలి
ఘటనలు ఏవైనా మనల అంటొద్దు
సారాంశం లో మాత్రం మనమే హద్దు
గీతలు చెరిపేసే పని భలే ముద్దు
పెద్ద చిన్న వయసుతొ పని లేదు
మాట మర్యాద కడుపును పూరించదు
లౌక్యం గా కదలటమే మెదడుకిచ్చే తర్ఫీదు
.....
Tuesday, June 10, 2014
Thursday, June 5, 2014
జీవితాలు రచించబడవు
ఓ కథకి
నువ్వెప్పుడూ నాయకుడివే
కొన్ని కథల్లో మాత్రం
సాధారణ పాత్రధారివి
నీ చుట్టూతా నాలుకలు తిరుగుతున్నపుడు
ఇరవై నాలుగు గంటల కాలాన్ని
సర్దుకోవటం అలవాటౌతుంది
కొన్ని సమయాలు చేతకానివి
నీ నొసలు మీది చెమటను తీయడానికి కూడా
సహకరించవు
అన్ని కథలు కొన్ని సందర్భాలందు
రాత్రి అందరం కలిసి భోంచేసినట్టు
మాట్లాడుకుంటూ గోడును మింగలేవు
కింద మీద నువ్వొక్కడివే కానప్పుడు
నీ పాత్రకి నైపుణ్యం జోడించడం
కుదరనిపని
ప్రతి కథ తన ప్రదర్శన మీద
అపనమ్మకాన్ని కల్గి ఉండదు
కథ మాత్రం
ఎప్పటికీ ఆగదు
ఇంకో కథలో జాడని విడువగా
కాలంతో పాటు చిగురేయటం
దాని స్వంత సంబరం.
.....
Subscribe to:
Posts (Atom)