మధ్య రాత్రి తలుపు తట్టినా
కవిత్వమై కౌగిలించుకునేవాడు
జీవితాన్ని మచ్చిక చేసుకుంటూ
జ్ఞాపకాల గొలుసులు కట్టి
'సరిహద్దు రేఖ'లు దాటని వాడు
ఊరుకు నగరానికి పరుచుకున్న వంతెన
కవిత్వానికి గుండె వండి పెట్టే కవి
సాహిత్యం వెంట బతుకును నడిపించుకుంటున్న
కలల గూటి పాటల పిట్ట
కాళ్ళకి గిల్లలు కట్టుకొని
పదునైన భాషను పట్టుకొని
కాలం పై సవారీ చేస్తున్న గరీబు
కవులందరికీ దిక్కును నాటిన వాడు
కవిత్వాన్ని ఇల్లు చేసుకున్నవాడు
ఎల్లలు తెలీని పసి పిల్లవాడు
నవ్వుల సుపారీ
ఎనలేని మిత్ర సంపద కల్గిన కుబేరుడు
మా 'యాకూబు'డు .
.....
No comments:
Post a Comment