Monday, September 3, 2012

శ్రీ అఫ్సర్


అక్షరాల సౌరభాన్ని
సముద్రాల మీదుగా
గాలికి అంట గట్టి పంపించువాడు



కొత్త కొత్త గడ్డిపూల కవుల గాలికి పరవశించి
పాదులు చేసి ప్రాణం పోయువాడు

కాలం మెట్లెక్కిన కవి

ఖండ ఖండాల సాహిత్యాన్ని
భుజం మీద చెయ్యేసి నడుస్తూ
తేలికగా తెలుపగల నేర్పరి

'అ'కారాన్ని తలకెత్తుకున్న వాడు

కవిత్వంతో సమానంగా ,సమ్మోహనంగా
ఉపన్యసించ గల దిట్ట


'ఊరు చివర' నుండి 'వలస'పోయినా
గుండె నిండా బెంగ నిండిన వాడు

నిరంతర తాపసి

ఇక్కడి వాడే అయినా ,అప్పుడప్పుడు
ఆకాశం నుండి దిగివచ్చే అఫ్సరుడు .

.....

No comments:

Post a Comment