Friday, April 20, 2012

ఎప్పుడూ ఎక్కడికి వెలతావ్?

ఏ కాలం వెనకాల వెళ్ళినా 
పరిమళాల పాటలు పాడే 
పూలు వికసిస్తాయి 

బాటసారుల పరవశంతో 
వాటికేం పని?

అవి సమయానికి శోభను తెస్తూ 
నీ మనసు చుట్టూతా 
బందిఖానా నిర్మిస్తాయి 
వాటి భాషలో అవి సౌందర్యాన్ని రచిస్తాయి 

పూల భాష తెలుసుకోవడం కోసం 
నేను 
కవిత్వం వెంటపడ్డాను .....ఇష్టంగా.

2 comments:

  1. Poola bhaashakoo kavitvaanikee antati avinaabhaava sambandhamaa Dear?...Nice .

    ReplyDelete
  2. అవి సమయానికి శోభను తెస్తూ
    నీ మనసు చుట్టూతా
    బందిఖానా నిర్మిస్తాయి
    వాటి భాషలో అవి సౌందర్యాన్ని రచిస్తాయి vyaktheekarana adhbutham

    ReplyDelete