Thursday, April 12, 2012

ఏకాంతం వాలిన వేళలందు ....



సూర్యుడు నిను 

వెంటబెట్టుకొని ఉదయిస్తాడు...


నిన్నటి రోజు 

నేను చేసిన తప్పోకటి 

నీ చూపుడు వేలుని నా మీదికి ఎక్కుపెడుతుంది 


ఓ ఎడతెగని 

కాగితంపూల సంభాషణ.



ఒంటరిని కావడానికి వీలులేదని 

నీ కంఠస్వరం మంత్రం చదివేను....



నాడులకెలా తెలుస్తుందో 

నీ జ్ఞాపకం రాగానే 

సీతాకోక చిలుకల గుంపుల మధ్య 

పూల గుత్తి లా మారుతుంది గుండె 



ఎప్పటికీ ఓ ప్రశ్న 

ప్రశ్నిస్తూనే ఉంటుంది 

ఓ జవాబుకు మాత్రం 

ధైర్యం లేక

కన్నీటి బిందువులో దూకుతుంది.......



          *****

7 comments:

  1. నాడులకెలా తెలుస్తుందో

    నీ జ్ఞాపకం రాగానే

    సీతాకోక చిలుకల గుంపుల మధ్య

    పూల గుత్తి లా మారుతుంది గుండె

    great expression, guruswami!

    ReplyDelete
  2. "నాడులకెలా తెలుస్తుందో

    నీ జ్ఞాపకం రాగానే

    సీతాకోక చిలుకల గుంపుల మధ్య

    పూల గుత్తి లా మారుతుంది గుండె "
    super sir

    ReplyDelete
  3. "కాగితంపూల సంభాషణ" "పూలగుత్తిలా మారిన గుండే" మెచ్చుకోకుండా ఉండలేని భావజాలం స్వామిగారూ...

    ReplyDelete
  4. Punna sudarshan14 April, 2012

    Great expression Sir.

    ReplyDelete
  5. వ్యక్తీకరణ అద్భుతం.ధైర్యం లేని జవాబు కన్నీటిలో దూకడం వెంటాడే గొప్ప భావన.

    ReplyDelete
  6. నాడులకెలా తెలుస్తుందో

    నీ జ్ఞాపకం రాగానే

    సీతాకోక చిలుకల గుంపుల మధ్య

    పూల గుత్తి లా మారుతుంది గుండె great expression

    ReplyDelete