నీ కోసం ఋణపడ్డాను
నిశ్శబ్దానికి చాలా
ఋణపడి ఉంటాను
ఎన్నిసార్లు నిను
నా ముందటికి తోసి
మిగిలిన తలుపులు మూసెనో
ఎన్ని కథనాల్ని తినిపించెనో
అలిగిన,ఊరట కలిగించెనో
సౌందర్యాన్ని రంగరించి పోస్తూ
మన నిస్తంత్రీ ప్రేమను
ఎట్లా కాపాడెనో
ఆశ చావనివ్వకుండా
ఊపిరిని బతికించి నందుకైనా
నిశ్శబ్దానికి చాలా
ఋణపడి ఉంటాను.
*****
నిశ్శబ్దానికి చాలా
ఋణపడి ఉంటాను
ఎన్నిసార్లు నిను
నా ముందటికి తోసి
మిగిలిన తలుపులు మూసెనో
ఎన్ని కథనాల్ని తినిపించెనో
అలిగిన,ఊరట కలిగించెనో
సౌందర్యాన్ని రంగరించి పోస్తూ
మన నిస్తంత్రీ ప్రేమను
ఎట్లా కాపాడెనో
ఆశ చావనివ్వకుండా
ఊపిరిని బతికించి నందుకైనా
నిశ్శబ్దానికి చాలా
ఋణపడి ఉంటాను.
*****
"సౌందర్యాన్ని రంగరించి పోస్తూ
ReplyDeleteమన నిస్తంత్రీ ప్రేమను
ఎట్లా కాపాడెనో" మీ కవిత్వం ఓ ఓదార్పు. ఓ చల్లని మాట.