Thursday, February 7, 2013

కాలం వెంట...2

 

సముద్రం నీ కాళ్ళు 
కడుగుతున్నపుడు 

ఆకాశం నీలం అలలై
వాలుతున్నపుడు 

మనుషులు తమ ఆకారాల్ని విడవకుండా 
పరవశించి పొతున్నపుడు 

దిక్కులు కరిగి పోయి 
కన్నీటి బిందువులో ఇంకిపోయినపుడు 

తడిసి పోతున్న రాళ్ళూ రప్పలు 
పులకిస్తున్న గుట్టలు గుండ్లు 
నిశ్శబ్దరాగాల్ని ఆలపిస్తున్నపుడు 

మంచు చలిముత్యాల్లా 
స్పర్శిస్తున్నప్పుడు 

వెగటు దాపరికాల మేకప్ తొలగి 
గులక రాల్లై గుచ్చుకునేటప్పుడు 

నడకలు కనుపాపల్ని 
అనుకరించనప్పుడు 

పసిపాప బుడి బుడి పాదాల ఒత్తిడి దుఃఖం 
నీ గుండె మీద కదులుతున్నపుడు 

ఆనందుడా...!
దోసిలి పట్టి వినమ్రంగా 
జీవితం ముందు మోకరిల్లడమే.

.....
16.1.2013.

DR. GURUSWAMY PULIPATI .

2 comments:

  1. చాలా బాగుంది మాస్టారు మీ కవిత. ఆనందభరితమైన ఒక కవితా తాత్వికత హృదయాన్ని తట్టి లేపుతున్నట్లు చాలా నిర్మలంగా ఉంది.

    ReplyDelete
  2. బ్లాగులను ప్రచురించడంలో కూడలి వారు పక్షపాతం చూపుతున్నారు. వారికి నచ్చిన బ్లాగులను ముందుగా ప్రచురించడం నచ్చని (రాజకీయ) బ్లాగులను రెండు గంటలు ఆలస్యంగా ప్రచురించడం నేను గమనించాను

    ReplyDelete