Tuesday, August 21, 2012

తీరొక్క బాధలు


ఎన్ని చెరిపినా 
ఇంకొన్ని మిగిలే ఉంటాయి 

నిన్ను తెలుపని వాసనలు కొత్తవి 
నా మీదికి తెరుచుకున్నపుడు 
నాకు సందేహమే నువ్వు 

నువ్వెప్పుడూ ఇంతే 
మనసులో కలిసి వెల్లిపోతావ్
గావర పెడతావ్ 
గుండెను చేది పెడతావ్ 

ఎవరు ఎవరికీ అర్ధం కాని బజారిది 
అలుపెరుగని కాళ్ళ శ్వాస 

ఒకరు పూర్తిగా 
అర్ధం కావాలనుకోవటం భ్రమ 
తెగదు ముడిపడదు 
యాప్యము.
    .....

1 comment:

  1. నిజమే ఇంకొకరు పూర్తిగా అర్థం కావటం కష్టమే!బాగుంది మీ కవిత.

    ReplyDelete