Wednesday, June 11, 2014

అలంకరణ

అలంకరణ మనం అనుకున్నదే శాస్త్రం మనం చెప్పినట్టు వినే వాళ్లే మన వారు మన కోసం పని చేసే వారు మన సేవకులు మనం ఎవరినీ ఇష్టపడం మనల ఇష్ట పడే వారు తప్పుకొని పోలేరు మన కోసమే ఎదుటి వారి శ్రమ వాడాలి మనం సరదాని పొందగలం వారి సంపద తో సంతోషం కూడబెట్టగలం వారితో వున్నట్టుగా వుండటమే వారి అదృష్టం మనం స్వార్ధం గా కనపడవద్దు అవసరానికి ప్రార్ధించి పని ముగించాలి లోపలి వాన్ని ఎల్లప్పుడు తడుపుతూ వుండాలి ఎదుటి వాన్ని వాడటమే నేర్పు మన ఖజానాకు రాకూడదు ముప్పు మనం భజన చేసినా మనకే రావాలి మెప్పు జనంలో నటించడం మరవద్దు మన ఇంట్లో ఏముందో తెలియొద్దు అవసరానికి తప్ప చిరునవ్వును కూడా తీయొద్దు బంధాలకు గంధాలు పుయ్యాలి భావాలను భలే గ ముయ్యాలి తెలియనిదంతా మన జ్ఞానం తో దాయాలి ఘటనలు ఏవైనా మనల అంటొద్దు సారాంశం లో మాత్రం మనమే హద్దు గీతలు చెరిపేసే పని భలే ముద్దు పెద్ద చిన్న వయసుతొ పని లేదు మాట మర్యాద కడుపును పూరించదు లౌక్యం గా కదలటమే మెదడుకిచ్చే తర్ఫీదు .....

1 comment:

  1. జనంలో నటించడం మరవద్దు మన ఇంట్లో ఏముందో తెలియొద్దు అవసరానికి తప్ప చిరునవ్వును కూడా తీయొద్దు బంధాలకు...Nice lines .

    ReplyDelete