వస్తూ వస్తూ
నా లోపలి కిటికీలు తీస్తావు
కొన్నివేల
సీతాకోకచిలుకలు
విచ్చుకుంటాయి
రెప రెప రెప రెప రెప
రంగుల గిరికీలు కొడుతూ
వాసనల బరువు మోసుకోద్దామని
తీపి రాగాలై ,నీ
కనురెప్పల మీద వాలి
ఆనందపు జ్ఞానాన్ని పంచుకుంటాయి
వెళుతూ వెళుతూ
చివరి చూపుల కొనలగుండా
కాటుక చీకటి విదిల్చి
ఊపిరి గొట్టానికి
జడ పిన్ను బిగించి పోతావ్...
............
chaalaa baagumdi
ReplyDeleteనిజమే.
ReplyDeleteseetakoka chiluka palukulu bagunnai
ReplyDeleteమీ కవితలు దాదాపుగా చదివేసాను. వ్యక్తీకరణలు బాగున్నాయి. ఈ కవితా చిరుజల్లులా మొదలై ఉప్పెనలా కదిపింది. నా బ్లాగులో వ్యాఖ్య ద్వారాగానే తెలుసుకున్నా, ఆలస్యం కానందుకు ఆనందం.
ReplyDelete