Sunday, March 22, 2009

జిలేబి దుఃఖం

ఓ బొమ్మ గీసి
దుఃఖాన్ని
గోడకి తగిలించాలి

లేదా

ఓ స్త్రీ పెదాలను
ఎప్పటికీ కనిపించేటట్టు
అలంకరిస్తే చాలు

నరాల మీద
తమ మగత పాదాలతో
గిలిగింతలు పెట్టేవాళ్ళను
ఇష్టమైన ద్రవంగా
మార్చి త్రాగాలి

రాత్రి
నిద్రమీద వాలేటప్పుడు
దుప్పటి కింద
అతికించిన
దుఃఖాన్ని
నిద్ర లేపాలి
కాసేపు దాంతో
సరదాలాడాలి

ఓ మిఠాయి లా
తినాలి
దుఃఖాన్ని...

.............

1 comment:

  1. "ఓ మిఠాయి లా
    తినాలి
    దుఃఖాన్ని..."

    మీ కవితల్లో వేదన దండలో దారం లా ఉంది. కానీ - బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ - అన్న తీరుగానూ ఉన్నాయి.

    ReplyDelete